ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లను అలవోకగా చేసి శహభాశ్ అనిపించుకున్న ప్రముఖ హైదరాబాద్ డాక్టర్ ఈమె. ప్రపంచలోనే అత్యంత వేగంగా రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ చేసే గొప్ప డాక్టర్ చిరంజీవిగారు. తన అన్న సన్‌షైన్ హాస్పిటల్ యం.డి గురవారెడ్డి గారితో పాటు స్టాఫంతా ఎంతో ప్రేమగా మమ్మీ అని పిలుస్తారట. అమ్మకు ఇచ్చినంత విలువ ప్రతి ఒక్కరు తనకిస్తారని ఎంతో ప్రేమగా చూస్తారని ఆనందంగా చెప్పుకొచ్చారు ఈ టాప్ ఆర్థోపెడిక్ సర్జన్ చిరంజీవి గారు. ఈమెను కొంతమంది మెగాస్టార్ అని కూడా పిలుస్తారట. భర్త నగేశ్‌తో పాటు తన ఇద్దరు పిల్లలు సపోర్టు చేయటంతో కెరీర్‌లో ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నానని ఎంతో ముచ్చటగా చెప్పుకొచ్చారామె. తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్ అని తన కోరికమేరకే డాక్టర్ అయ్యానన్నారామె. తన తల్లి రంగనాయకమ్మ గారు ఎంత పెద్ద డాక్టరో జి.యం.సి మెడికల్ కాలేజి 1978 బ్యాచ్ అనగానే విఐపి బ్యాచ్ అని ఎందుకంటారో చాలా సరదాగా చెప్పారు. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూ ఇన్ ట్యాగ్‌తెలుగు. ఇంటర్వూ బై శివమల్లాల